విశాఖలో 1.6 కోట్ల రూపాయలతో నిర్మించిన ఎంవీపీ మోడల్ పోలీస్ స్టేషన్ భవనాన్ని డీజీపీ ఆర్పీ ఠాకూర్ ప్రారంభించారు. ఇదే తరహాలో రాష్ట్ర వ్యాప్తంగా మోడల్ పోలీస్ స్టేషన్లు నిర్మిస్తామని ఆయన తెలిపారు. విశాఖ రేవ్ పార్టీ డ్రగ్ కేసు విషయంలో ఇప్పటి వరకు ఆరుగురిని అరెస్టు చేశామని వివరించారు. ప్రస్తుతానికి ఐదుగురు డ్రగ్ సప్లయర్స్ ఉన్నట్లు గుర్తించామని.. వందమంది డ్రగ్ ను వినియోగించినట్లు తమ దర్యాప్తులో తేలిందన్నారు. ఈ కేసులో మరికొంత మంది పెద్దలు ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని.. వారిని కూడా అరెస్టు చేస్తామని డీజీపీ అన్నారు. డ్రగ్స్ సంబంధించి ఏ సమాచారం ఉన్నా 75693 09090 నంబర్ కు సమాచారం ఇవ్వాలని కోరారు.
ఎంవీపీ మోడల్ పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ
విశాఖకు ఉన్న ప్రత్యేకతను ఎవరైనా పాడు చేయాలని చూస్తే ఎవర్నీ ఉపేక్షించబోమని డీజీపీ ఆర్పీ ఠాకూర్ హెచ్చరించారు. విశాఖలో 1.6కోట్ల వ్యయంతో నిర్మించిన ఎంవీపీ మోడల్ పోలీసు స్టేషన్ను ఆయన ప్రారంభించారు.
ఎంవీపీ మోడల్ పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ