ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చోడవరంలో.. నడిరోడ్డుపై యువకుడి దారుణ హత్య - యువకుడి

విశాఖ జిల్లా చోడవరంలో దారుణం జరిగింది. నడి రోడ్డుపై ఓ యువకుడిని దుండగుడు కిరాతకంగా హత్య చేశాడు. హంతకుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

చోడవరంలో ఓ యువకుడి దారుణ హత్య

By

Published : Jul 14, 2019, 6:43 PM IST

Updated : Jul 14, 2019, 8:05 PM IST

విశాఖ జిల్లా చోడవరంలో దారుణం చోటు చేసుకుంది. నడిరోడ్డుపై ఓ యువకుడిని దుండగుడు అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. పట్టణంలోని బీఎన్‌ రోడ్డు ప్రాంతంలోని ఓ మద్యం దుకాణం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. హత్యకు గురైన యువకుడిని చోడవరం ఎడ్లవీధికి చెందిన కోన రాజేశ్‌గా పోలీసులు గుర్తించారు.

చోడవరంలో ఓ యువకుడి దారుణ హత్య

హెల్మెట్ ధరించి ద్విచక్రవాహనంపై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి.. తన వెంట తెచ్చుకున్న కత్తితో రాజేశ్‌ని దారుణంగా హతమార్చిన విషయం సీసీ ఫూటేజ్​లో స్పష్టంగా కనిపిస్తోంది. తొలుత కత్తితో నరకిన అనంతరం.. రాజేశ్‌ కిందపడిపోయాడు. ఆ తర్వాత కొద్దిదూరం వెళ్లిన దుండగుడు మళ్లీ వెనక్కి వచ్చి రక్తపుమడుగులో ఉన్న రాజేశ్‌పై మరోసారి తన కర్కశత్వాన్ని ప్రదర్శించాడు. చనిపోయాడో లేదో అన్న అనుమానంతో మరోసారి కత్తితో వేటు వేసి అక్కడినుంచి పరారయ్యాడు. హంతకుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ఇదీ చదవండి:విషాదం.. ఇద్దరు పిల్లలు సహా తల్లి బలవన్మరణం

Last Updated : Jul 14, 2019, 8:05 PM IST

ABOUT THE AUTHOR

...view details