విశాఖ జిల్లా భీమునిపట్నం మండలంలోని పట్ల కొండపై వనం - మనం కార్యక్రమం నిర్వహించారు. వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి ముఖ్యఅతిధిగా హాజరై మొక్కలు నాటారు. సామాజిక బాధ్యతలో భాగంగా... పర్యావరణ పరిరక్షణకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మొక్కలు నాటడం అభినందనీయమన్నారు. భవిష్యత్ తరాలకు కాలుష్య రహిత సమాజాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని కోరారు.
'పోలీస్ శాఖ సామాజిక బాధ్యత అభినందనీయం'
భవిష్యత్ తరాలకు కాలుష్య రహిత సమాజాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటి... వాటిని సంరక్షించాలని రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కోరారు. విశాఖ జిల్లా భీమునిపట్నం మండలంలో ఆయన వనం మనం కార్యక్రమానికి హాజరయ్యారు.
పోలీస్ శాఖ సామాజిక బాధ్యత అభినందనీయం