విశాఖలోని ఎన్ఏడీ ఫ్లై ఓవర్ పనులను మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పరిశీలించారు. ఎయిర్ పోర్ట్ నుంచి ఎన్ఎస్టీఎల్ వైపు పనులు పూర్తి కావడం ఆ మార్గంలో వాహనాలు వదలాల్సిందిగా మంత్రి బొత్స అధికారులను ఆదేశించారు. ఆగస్టులో గోపాలపట్నం నుంచి వచ్చే మార్గంలో ట్రాఫిక్ వదిలేందుకు ఏర్పాట్లు చేయాలని నిర్దేశించారు. మిగిలిన పనులు నిర్ణీత సమయంలో పూర్తిచేయాలని కాంట్రాక్టర్లకు మంత్రులు సూచించారు. నగరానికి వచ్చే ప్రధానమైన ఈ వంతెన పనుల్లో జాప్యం లేకుండా చూడాల్సిన బాధ్యత కాంట్రాక్టర్లకు, ఇంజనీర్లకు, వీఎంఆర్డీఏ అధికారులకు ఉందన్నారు. తాత్కాలిక లైటింగ్ ఏర్పాటు చేసి, ఎయిర్ పోర్ట్ నుంచి వాహనాలు వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తామని మంత్రులకు విజయ్ నిర్మాణ సంస్థ తెలిపింది.
ఎన్ఏడీ వంతెన పనులు పరిశీలించిన మంత్రులు - Vijay Construction Company latest news
విశాఖలో ఎన్ఏడీ ఫ్లై ఓవర్ పనులను మున్సిపల్ శాఖ, పర్యాటక శాఖ మంత్రులు కలిసి పరిశీలించారు. పనుల్లో జాప్యం లేకుండా నిర్ధేశించిన కాల పరిమితిలో పూర్తి చేయాలని విజయ్ నిర్మాణ సంస్థకు మంత్రులు సూచించారు.
ఎన్ఏడీ వంతెన పనులు పరిశీలించిన మంత్రులు