ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వంతెనపై నుంచి రాకపోకలు ప్రారంభించండి: మంత్రి బొత్స

నేటి నుంచి విశాఖ ఎన్​ఏడీ జంక్షన్ వద్ద నిర్మించిన వంతెనపై నుంచి రాకపోకలు ప్రారంభించాలని మంత్రి బొత్స సత్యనారాయణ అధికారులను ఆదేశించారు.

minister Botsa Visit NAD Fly over
వంతెన పనుల పరిశీలించిన మంత్రి బొత్స

By

Published : Dec 28, 2020, 1:58 PM IST

విశాఖ ఎన్ఏడీ జంక్షన్ వద్ద రూపుదిద్దుకున్న వంతెనపై రాకపోకలు నేటి నుంచి ప్రారంభించాలని మంత్రి బొత్స సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. ఈ ప్రాజెక్టును విజయ్ నిర్మాణ సంస్థ పూర్తి చేస్తోంది. పారిశ్రామిక ప్రాంతం, ఎయిర్ పోర్టు, గోపాలపట్నం, మర్రిపాలెం జాతీయ రహదారి వీటన్నింటినీ జంక్షన్​గా ఎన్​ఏడీ ఉంది. నిత్యం వాహనాల రద్దీతో ఈ జంక్షన్ కిటకిటలాడుతోంది. ఈ రద్దీని నివారించటానికి రెండేళ్ల కిందట వలయాకారపు పై వంతెన నిర్మాణం చేపట్టారు. కరోనా కారణంగా దాదాపు ఆరు నెలల పాటు పనులు నిలిచిపోయాయి. ఈ మేరకు ఆలస్య నివారణ చర్యలను ప్రభుత్వం చేపట్టింది. త్వరితగతిన వంతెన నిర్మాణం పూర్తిచేయాలని గుత్తేదారులకు నిర్దేశించింది. ఇప్పటికే పూర్తయిన వైపు ట్రాఫిక్​ను అనుమతిస్తున్నారు. ఈ రోజు నుంచి అన్ని వైపుల నుంచి ట్రాఫిక్ అనుమతించాల్సిందిగా మంత్రి అధికారులను ఆదేశించారు. నాణ్యతా లోపాలు పరిశీలించి....పై వంతెన కింద రహదారి పనులు అన్నింటినీ
సకాలంలో పూర్తి చేయాల్సిందిగా స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details