'భాజపాకు అభ్యర్థులే లేరు' - railway zone
2019 ఎన్నికల్లో భాజపా నుంచి ఎమ్మెల్యే...ఎంపీగా పోటీచేసే అభ్యర్థులు లేరని మంత్రి అయ్యన్నపాత్రుడు ఎద్దేవా చేశారు. వెనకబడిన జిల్లాలకు కేంద్రం సహకారం అందించాలని డిమాండ్ చేశారు.
అధిష్ఠానం నిర్ణయించిన అభ్యర్థుల గెలుపుకు సమిష్టిగాపనిచేస్తాని మంత్రి అయ్యన్నపాత్రుడు ఉద్ఘాటించారు. టికెట్లు ఎవరికి ఖరారు చేసినా గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. విశాఖ జిల్లా నర్సీపట్నంలో 'ఈటీవీ భారత్'తో ప్రత్యేకంగా మాట్లాడారు. అభ్యర్థుల ఎంపిక భాధ్యత పూర్తిగా చంద్రబాబుదేనన్నారు. చిత్తశుద్ధితో అభ్యర్థులను గెలిపించాల్సిన బాధ్యత ప్రతీ నాయకుడు... కార్యకర్తపై ఉందన్నారు. ప్రధాని నరేంద్రమోదీ... రాష్టంపై వివక్ష చూపించారని ఆరోపించారు. 2019 ఎన్నికల్లో భాజపా నుంచి ఎమ్మెల్యే...ఎంపీగా పోటీచేసే అభ్యర్థులే లేరని ఎద్దేవా చేశారు. వెనకబడిన జిల్లాలకు కేంద్రం సహకారం అందించాలని డిమాండ్ చేశారు. కేంద్రం పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి తగిన సహకారం అందించలేదన్నారు.