విశాఖ జిల్లా లచ్చన్నపాలెం నుంచి మంత్రి అయ్యన్నపాత్రుడు ఎన్నికల శంఖారావం పూరించారు. పెద్ద సంఖ్యలో గ్రామస్థులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎన్నికల శంఖారావం పూరించిన మంత్రి అయ్యన్నపాత్రుడు
By
Published : Mar 16, 2019, 12:39 PM IST
ఎన్నికల శంఖారావం పూరించిన మంత్రి అయ్యన్నపాత్రుడు
విశాఖ జిల్లా లచ్చన్నపాలెంలో రోడ్లు, భవనాల శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు.పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, గ్రామస్థులు ఘనస్వాగతం పలికారు. ముఖ్యమంత్రి కుర్చీ కోసం వైకాపా అధినేత జగన్.. కుట్రరాజకీయాలు చేస్తున్నారని మంత్రి ఆరోపించారు.ముఖ్యమంత్రి చంద్రబాబు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే ఈ ఎన్నికల్లో తెదేపాని భారీఆధిక్యంతో గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు.