విశాఖ జిల్లా చోడవరం మండలంలో 534 మంది ఒడిశా నుంచి వచ్చిన కూలీలు ఇటుకల బట్టీల వద్ద ఉన్నారు. వీరంతా తమ ఊళ్లకు వెళ్లేందుకు సమాయత్తమవుతున్నారు. అనుమతుల్లేవంటూ అధికారులు వీరిని నివారిస్తున్నారు.
వలస కూలీల అగచాట్లు.. పట్టించుకునే వారేరి..? - chodavaram varthalu
'ఇక్కడకు మేము వచ్చిన పని అయిపోయింది. వెళ్లి పోదామనుకుంటే లాక్డౌన్ వచ్చిపడింది. యాజమాని పట్టించుకోలేదు..చేసేదేమీ లేక ఈ రోజు తెల్లవారుజామున మూడు గంటలకు బయలుదేరాం..పోలీసులను కలిసి పర్మిషన్ అడిగాం. ఇదిగో తహశీల్దార్ ఆఫీసులో కూర్చోబెట్టారు'..ఇదీ చోడవరంలో ఉన్న ఓడిశా వలస కూలీల అవేదన.
చోడవరం మండలం గవరవరం గ్రామంలో 43 మంది వలస కూలీలున్నారు. వీరంతా శుక్రవారం తెల్లవారుజామున మూడు గంటలకు బయులుదేరారు. వీరిలో మహిళలతో పాటు, పది మంది పిల్లు ఉన్నారు. తొమ్మిది కిలో మీటర్లు నడిచి చోడవరం చేరుకున్నారు. చోడవరం పోలీసులు వీరిని తహసీల్దార్ కార్యాలయానికి పంపారు. అక్కడ వీరికి దాతలు అల్ఫాహారం, భోజనం అందించారు. తహశీల్దార్ రవికుమార్ వచ్చి త్వరలోనే మీరు స్వగ్రామాలకు వెళ్లే ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. గవరవరం ఇటుకల బట్టి యాజమానిని పిలిచి తీవ్రంగా మందలించారు. వీరికి అనుమతులు వచ్చే వరకు జాగ్రత్తగా చూడాలని చెప్పి వెనక్కి గవరవరం పంపించారు.
ఇది చదవండివలస కార్మికుల దైన్యం... సొంత గ్రామాల్లోకి అనుమతించని గ్రామస్థులు