విశాఖ జిల్లా ఎలమంచిలి పట్టణంలో కరోనా వైరస్ కారణంగా ఓ వివాహం నిరాడంబరంగా జరిగింది. వరుడు, వధువు, వారి తల్లిదండ్రులు, పురోహితుడు సమక్షంలోనే పెళ్లి తంతు పూర్తైంది. లాక్డౌన్ నేపథ్యంలో ఇలా పెళ్లి చేసుకున్నామని.. కరోనా వైరస్ తొలగిపోయాక అందరి బంధువులకు విందు నిర్వహిస్తామని నవ దంపతులు తెలిపారు.
కరోనా ఎఫెక్ట్.. కేవలం ఐదుగురి సమక్షంలోనే వివాహం..! - corona cases in vishaka news
కరోనా వ్యాప్తి కారణంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలవుతోంది. ఈ క్రమంలో వివాహాలు సైతం నిలిచిపోయాయి. అయితే కొందరు ముందుగా అనుకున్న ముహూర్తానికే పెళ్లి తంతు జరిపిస్తున్నారు. విశాఖలో కేవలం ఐదుగురి సమక్షంలోనే ఓ వివాహం నిరాడంబరంగా జరిగింది.
marriage in yalamanchali vishaka