విశాఖ జిల్లా దేవరాపల్లి మండలంలోని పలు ప్రధాన రహదారుల్లో తుప్పలు దట్టంగా ఉన్నాయి. వర్షాలకు మరింత ఏపుగా పెరిగి ప్రమాదకరంగా మారాయి. తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో ఇటీవల ప్రభుత్వ విప్ ముత్యాలనాయుడు ఆయన స్వగ్రామం తారువలో ప్రజలతో కలిసి రోడ్డు పక్కన తుప్పలను పెద్ద ఎత్తున తొలగించారు. ఆయన్ని ఆదర్శంగా తీసుకొని సోమవారం కొత్తపెంట నాయకులు, ప్రజలు ఆ గ్రామంలోని రోడ్డుపై ఇరువైపులా తుప్పలను తొలగించారు. తాజాగా బోయిలకింతాడ, మామిడిపల్లి గ్రామస్థులు, నాయకులు పెద్ద ఎత్తున శ్రమదానంతో తుప్పలను తొలగించి ఆదర్శంగా నిలిచారు.
పోటాపోటీగా శ్రమదానం..రహదారులకు కొత్త రూపం
భారీ వర్షాల కారణంగా రహదారులకు ఇరువైపులా తుప్పలు పేరుకుపోతున్నాయి. ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉండటంతో విశాఖ జిల్లాలోని పలు గ్రామాల్లో ప్రజలు శ్రమదానం చేసి తుప్పలను తొలగిస్తున్నారు.
శ్రమదానం చేస్తున్న గ్రామస్తులు