విశాఖలో మద్యం షాపుల వద్ద భారీ సంఖ్యలో మద్యం ప్రియులు క్యూలైన్లలో నిలిచారు. లాక్డౌన్ నేపథ్యంలో 43 రోజుల అనంతరం మద్యం దుకాణాలు తెరివడం వల్ల పెద్ద సంఖ్యలో ఆయా షాపులు వద్దకు చేరారు. విశాఖ జిల్లాలో మొత్తం 321 మద్యం దుకాణాలు ఉండగా, 313 దుకాణాలు నిబంధనల మేరకు తెరిచేందుకు అనుమతించారు. నగరంలో మద్యం షాపుల వద్ద ఎక్సైజ్, పోలీసు, ప్రైవేట్ సెక్యూరిటీతో బందోబస్తు ఏర్పాటు చేశారు. మద్యం షాపుల వద్ద ఆరడుగుల భౌతిక దూరం పాటించాలని పోలీసులు మందుబాబులకు అవగాహన కల్పించారు.
మద్యం షాపుల వద్ద గుమిగూడిన జనం
నగరంలో మద్యం దుకాణాలు తెరిచారు. షాపుల వద్ద ఎక్సైజ్, పోలీసు, ప్రైవేట్ సిబ్బంది భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రజలు భౌతిక దూరం పాటించేలా విధంగా పోలీసులు చర్యలు తీసుకున్నారు.
భౌతిక దూరం పాటిస్తున్న ప్రజలు