జీవిత బీమా సంస్థ (ఎల్.ఐ.సి) చోడవరం శాఖ కార్యాలయం ముందు ఉద్యోగులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఎఐఐఎఫ్ఎ అధ్వర్యంలో నిరసనలో అన్ని తరగతుల సిబ్బంది, ఉద్యోగులు పాల్గొన్నారు. జీవిత బీమా సంస్థలో ప్రభుత్వ వాటాల అమ్మకానికి వ్యతిరేకంగా ఈ నిరసన చేపట్టినట్లు చోడవరం శాఖ యూనియన్ అధ్యక్షుడు ఎం.అప్పలకొండ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం వాటా కేవలం అయిదు శాతమేనని అన్నారు. మిగిలిన 95 శాతం పాలసీదారులవని చెప్పారు. వాటాలను అమ్మే నైతిక అధికారం కేంద్రానికి లేదన్నారు.
చోడవరం ఎల్ఐసీ ముందు ఉద్యోగుల నిరసన - చోడవరంలో జీవిత బీమా సంస్థ వార్తలు
జీవిత బీమా సంస్థలో ప్రభుత్వ వాటాల అమ్మకానికి నిరసనగా విశాఖ జిల్లా చోడవరం శాఖ కార్యాలయం ముందు అన్ని తరగతుల సిబ్బంది, ఉద్యోగులు ధర్నా చేశారు.
చోడవరం శాఖ కార్యాలయం ముందు బీమా ఉద్యోగుల నిరసన