ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కోనాం ఎగువ కాలువలో మంచాల రైతుల శ్రమదానం - visakhapatnam newsupdates

విశాఖ జిల్లా కోనాం జలాశయం పరిధిలో ఎగువ సాగునీటి కాలువలో మంచాల రైతులు శ్రమదానం చేశారు. కొన్నాళ్లుగా కాలువలో పేరుకుపోయిన నాచు మొక్కలను రైతులు పెద్ద ఎత్తున తొలగించారు.

labor of the manchala-farmers in the upper canal of Konam
కోనాం ఎగువ కాలువలో మంచాల రైతుల శ్రమదానం

By

Published : Oct 31, 2020, 9:49 PM IST

విశాఖ జిల్లా చీడికాడ మండలం కోనాం జలాశయం పరిధిలోని ఎగువ సాగునీటి కాలువలో నాచు తుప్పలు పెరుకుపోయాయి. దీంతో ఆయకట్టులో పొలాలకు సాగునీరు అందక రైతులు ఇబ్బంది పడుతున్నారు. దీనితో స్పందించిన మంచాల వైకాపా నాయకుడు పాటూరి రమణ ఆధ్వర్యంలో వంద మంది రైతులు ఎగువ సాగునీటి కాలువలో 2 కిలోమీటర్ల మేరకు నాచు తుప్పలను పూర్తిగా తొలగించారు. రైతుల శ్రమదానంతో పొలాలకు సాగునీరు పుష్కలంగా పారుతోంది. ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కార్యక్రమంలో వైకాపా మండల అధ్యక్షుడు అప్పారావు, దేముడు తదితరులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details