విశాఖ జిల్లాలోని రావికమతం మండలం కళ్యాణపులోవ జలాశయం ప్రాంతాన్ని పర్యటకంగా అభివృద్ధి చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే టూరిజం ప్రాంతీయ సంచాలకులు రాధాకృష్ణమూర్తి, అధికారుల బృందం... కళ్యాణపులోవ జలాశయ ప్రాంతాన్ని సందర్శించారు. ఆధ్యాత్మికతో పాటు పర్యటక స్థలంగా తీర్చిదిద్దుతామని రాధాకృష్ణమూర్తి పేర్కొన్నారు. ప్రధానంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలను పర్యటక ప్రదేశాలుగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. బోటు షికారు, పిల్లలు ఆడుకోవటానికి పార్కు, రెస్టారెంట్, కాటేజీల నిర్మాణం వంటివి ఏర్పాటు చేసే ఆలోచన ఉన్నట్టు ఆయన వెల్లడించారు. ఇందుకు తొలివిడతగా ప్రతిపాదనలు తయారు చేస్తున్నామన్నారు.
అందాల రావికమతం... పర్యటక ప్రాంతంగా మారనుంది..!
విశాఖ జిల్లా రావికమతం మండలం కళ్యాణపులోవ జలాశయ ప్రకృతి సోయగాన్ని చూడటానికి రెండు కళ్లు సరిపోవు. చుట్టూ పచ్చదనం, ఎటు చూసినా ఆహ్లాదం. ఇంత అందంగా ఉంది కాబట్టే అధికారులు ఈ జలాశయాన్ని పర్యటక ప్రాంతంగా తీర్చిదిద్దనున్నారు. దీనికి సంబంధించిన నివేదిక సిద్ధం చేస్తున్నారు.
విశాఖ కళ్యాణపులోవ జలాశయం పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి