ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గెలుపొందినా డిక్లరేషన్ ఫారం ఇవ్వలేదంటూ జనసేన కార్యకర్తల ధర్నా

పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులోని కేపీ పాలెం సౌత్ గ్రామపంచాయతీలో.. పంచాయతీ ఎన్నికల్లో ఆందోళనలు నెలకొన్నాయి. జనసేన మద్దతుతో పోటీ చేసిన విజయలక్ష్మి అనే మహిళ సర్పంచిగా గెలుపొందినా.. డిక్లరేషన్ ఫారం ఇవ్వకపోవటంతో ఘర్షణ జరిగింది.

By

Published : Feb 10, 2021, 9:39 AM IST

janasena followers protest mogalthuru in west godavari for not giving declaration form
గెలుపొందినా డిక్లరేషన్ ఫారం ఇవ్వలేదని జనసేన కార్యకర్తల ధర్నా

పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం కేపీ పాలెం సౌత్ గ్రామపంచాయతీలో ఘర్షణ జరిగింది. విజయలక్ష్మి అనే మహిళ ఏడు ఓట్లతో విజయం సాధించినా.. రెండుసార్లు రీకౌంటింగ్ నిర్వహించారు. వైకాపా వర్గీయులు గొడవ పెట్టుకుని బ్యాలెట్ బాక్సులు ఎత్తుకెల్లెందుకు ప్రయత్నించారు. వారిని అధికారులు అడ్డుకొన్నారు. జనసేన మద్దతుదారురాలైన విజయలక్ష్మి విజయం సాధించిందని అధికారులు ప్రకటించారు. అయితే డిక్లరేషన్ ఫారం మాత్రం అధికారులు ఇవ్వలేదు. దీంతో జనసేన కార్యకర్తలు కౌంటింగ్ హాల్ ముందు ధర్నా చేపట్టారు. వైకాపా వర్గీయులు బ్యాలెట్ పత్రాలను తీసుకెళ్లిపోయారని జనసేన వర్గీయులు ఆరోపిస్తున్నారు.

గెలుపొందినా డిక్లరేషన్ ఫారం ఇవ్వలేదని జనసేన కార్యకర్తల ధర్నా

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details