ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీలో ప్రవేశాలు ప్రారంభం

విశాఖలోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీలో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది.

By

Published : Jun 26, 2019, 8:49 AM IST

సంస్ధ డైరక్టర్ ఆచార్య ప్రసాద్

ఐఐపీఈ ప్రవేశాలు ప్రారంభించినట్లు వెల్లడించిన ఆసంస్ఖ డైరెక్టర్
విశాఖలోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీలో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ ఆరంభమైందని జూలైలో అడ్మిషన్లు పూర్తవుతాయని ఆ సంస్ధ డైరక్టర్ ఆచార్య ప్రసాద్ వెల్లడించారు. అన్ని జాతీయ సంస్థల మాదిరిగానే పెట్రోలియం, కెమికల్ విభాగాల్లో ఐదు చొప్పున సీట్లు పెరిగాయని తెలిపారు. ఇప్పటివరకు 100 సీట్లు ఉండగా అవి 110 అవుతున్నాయన్నారు. పెరిగిన సీట్లు ఈ డబ్ల్యూఎస్ కేటగిరీకి చెందుతాయని వివరించారు. తొలి బ్యాచ్ విద్యార్థులు మూడో ఏడాదిపూర్తి చేసుకున్నారని, వారికి పరిశ్రమలో చక్కని అనుభవం ఇక్కడి చమురు సంస్థలు అందించాయన్నారు. ఈ అనుభవం ప్రాంగణ ఎంపికల్లో విద్యార్థులకు ఉపయోగపడుతుందని వివరించారు. అన్​లైన్లో దరఖాస్తుల స్వీకరణ ఆరంభమైందని, జేఈఈ అర్హత సాధించిన వారు దరఖాస్తు చేసుకోవచ్చునన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details