విశాఖపట్నం జిల్లా గోపాలపట్నం నాగేంద్రకాలనీ నివాసం ఉండే పైడిరాజు, శారద నిత్యం గొడవపడుతూనే ఉంటారు. భార్యపై అనుమానంతో రోజూ కొడుతుండేవారు రాజు. ఆ అనుమానంతోనే శారదను హత్య చేశాడు. కత్తితో దాడి చేసి చంపేశాడు. వెంటనే వెళ్లి గోపాలపట్నం పోలీసుల ఎదుట లొంగిపోయాడు. పోలీసులు ఘటానా స్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. తమ కుమార్తె హత్యచేసినందుకు.. హంతకుణ్ణి కఠినంగా శిక్షించాలని మృతురాలి తల్లిదండ్రులు కోరుతున్నారు. ఈ హత్యతో ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు.
అనుమానంతో భార్యను చంపిన భర్త - case file
గోపాలపట్నం నాగేంద్ర కాలనీలో దారుణం జరిగింది. భార్యపై అనుమానంతో కత్తితో దాడి చేసి హతమార్చాడో భర్త.
అనుమానంతో భార్యను చంపిన భర్త