ఆంధ్రా-ఒడిశా సరిహద్దులోని గున్నమామిడి వద్ద భారీగా పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో 11 కిట్‌బ్యాగులు, క్యారేజీలు, ఎస్ఎల్ఆర్, ఏకే-47కు చెందిన 15 రౌండ్లు, 32 డిటోనేటర్లు, ఐఈడీ ఉన్నాయి. మావోయిస్టుల కదలికలపై పక్కా సమాచారంతో గాలింపు నిర్వహించామని ఒడిశా పోలీసులు తెలిపారు. పోలీసుల కదలికలను గమనించి మావోయిస్టులు కాల్పులు జరిపారని, ఈ ఘటనలో పోలీసులు తప్పించుకున్నారని మల్కన్‌గిరి జిల్లా ఎస్‌పీ రిషికేష్ కిల్లారి తెలిపారు. పరారైన మావోల కోసం గాలింపు నిర్వహిస్తున్నట్లు ఇరు రాష్ట్రాల పోలీసులు చెప్పారు.
ఏవోబీలో భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం
ఆంద్రా-ఒడిశా సరిహద్దుల్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. సరిహద్దులోని గున్నమామిడి వద్ద ఎదురుకాల్పులు జరిగాయి. అనంతరం ఘటనా స్థలం నుంచి భారీగా పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఏవోబీలో భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం