విశాఖ దక్షిణలో ఇళ్ల పండుగ - tdp
పేదలకు ఎన్టీఆర్ గృహకల్ప పేరుతో ప్రభుత్వం అందిస్తున్న ఇళ్ల ప్రారంభం విశాఖలో ఘనంగా జరిగింది. నియోజకవర్గంలో నిర్మించిన 230 గృహాలను ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ లబ్దిదారులకు అందించారు.
houses opening
పేద ప్రజలకు సొంతింటి కలను నిజం చేసే విధంగా ఎన్టీఆర్ గృహాలను ప్రభుత్వం అందిస్తోంది. విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గంలో నిర్మించిన 230 గృహాలను ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ లబ్దిదారులకు అందించారు. పేదలకు నాణ్యమైన రెండు పడకల ఇళ్లను నిర్మించి ఇచ్చిన ఘనత తెదేపా ప్రభుత్వానిదేనన్నారు. రాష్ట్ర అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి ఎల్లప్పూడు కృషి చేస్తారని ఉద్ఘాటించారు.