రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో హెచ్ఐవీ కేసులు వెలుగుచూడడంతో విశాఖ జైలు అధికారులు అప్రమత్తమయ్యారు. జైలులో నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆధ్వర్యంలో 265 మంది ఖైదీలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. గత నెలలో నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఎలాంటి పాజిటివ్ కేసులు నమోదు కాలేదని పర్యవేక్షణాధికారి ఎస్. రాహుల్ వెల్లడించారు. జైలుకు వచ్చే నాటికే ఐదుగురు ఖైదీలకు హెచ్ఐవీ సోకిందని తెలిపారు. వారికి అవసరమైన మందులు, పోషకాహారం అందిస్తున్నట్లు రాహుల్ తెలిపారు.
విశాఖ జైల్లోనూ ఐదుగురు ఖైదీలకు హెచ్ఐవీ - hiv cases
రాష్ట్రంలోని కేంద్ర కారాగారాల్లో హెచ్ఐవీ కేసులు వెలుగుచూడటంతో విశాఖ జైలు అధికారులు అప్రమత్తమయ్యారు. ఖైదీలకు వైద్య పరీక్షలు నిర్వహించారు.
విశాఖ కారాగారం