ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖకు చేరుకున్న గోదావరి ఎక్స్​ప్రెస్

తెలంగాణ రాష్ట్రం హైదారాబాద్ నుంచి గోదావరి ఎక్స్​ప్రెస్ ప్రయాణికులతో విశాఖకు చేరుకుంది. ప్రభుత్వం నిబంధనల ప్రకారం ..స్టేషన్​కు చేరుకున్న ప్రయాణికులకు కరోనా పరీక్షలు చేసి.. హోమ్ క్వారంటైన్ ముద్ర వేసి..ఇంటికి పంపుతున్నారు.

Godavari Express arriving in Visakha
విశాఖకు చేరుకున్న గోదావరి ఎక్స్​ప్రెస్

By

Published : Jun 3, 2020, 9:46 AM IST

హైద్రాబాద్ నుంచి విశాఖకు గోదావరి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులతో చేరుకుంది. ప్రభుత్వం నిబంధనల ప్రకారం రాష్ట్రానికి వచ్చిన ప్రయాణికులకు... రైల్వే స్టేషన్ లోపలే కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. వారి చేతికి హోమ్ క్వారంటైన్ ముద్ర వేసి పంపుతున్నారు. ప్రయాణికుల రైళ్లు వచ్చే ముందు ...వాల్తేర్ రైల్వే పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. వారు గేట్ నెంబర్- 1 ద్వారా బయటకు వచ్చేలా ఏర్పాటు చేశారు. అధికారులు బస్సులు, ప్రైవేట్ వాహనాలను రైల్వే స్టేషన్ గేట్ వెలుపలే ఏర్పాటుచేశారు. కేవలం బయటకు వచ్చే ప్రయాణికులు తప్ప మరెవ్వరూ ప్లాట్ ఫామ్​పై ఉండకుండా చర్యలు తీసుకున్నారు. విశాఖ నుంచి బయట ఊళ్లకు వెళ్లే వారికి జ్ఞానాపురం వైపు నుంచి ప్రవేశం కల్పిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details