ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఎల్‌జీ పాలీమర్స్‌ ప్రతినిధులకు అనుమతులివ్వండి'

విశాఖలోని ఎల్​జీ పాలిమర్స్‌ ప్రమాదంపై దర్యాప్తు చేసేందుకు వచ్చిన దక్షిణ కొరియా నిపుణుల బృందం... స్వదేశానికి వెళ్లేందుకు అనుమతులు వచ్చేలా చూడాలని విశాఖ సీపీని‌ కొరియా ఎంబసీ అధికారులు కోరారు. వారు కొన్ని వారాలుగా విశాఖలోనే ఉన్నారు.

Give permission to LG Polymers representatives for travel to Korea
Give permission to LG Polymers representatives for travel to Korea

By

Published : Jun 6, 2020, 11:42 AM IST

దక్షిణ కొరియా నుంచి విశాఖకు వచ్చిన ఎల్‌జీ పాలిమర్స్‌ సాంకేతిక బృందాన్ని స్వదేశానికి పంపేందుకు ఆ దేశ ఎంబసీ అధికారులు చర్యలు మొదలుపెట్టారు. విశాఖ పోలీసు కమిషనర్‌ మీనాతో వారు భేటీ అయ్యారు. 8 మందితో కూడిన ఎల్‌జీ పాలిమర్స్‌ సాంకేతిక బృంద సభ్యులు కొన్ని వారాలుగా విశాఖలోనే ఉండిపోయారని... స్వదేశానికి వెళ్లేందుకు వారికి అనుమతులు వచ్చేలా చూడాలని ఎంబసీ అధికారులు కోరారు. గ్యాస్​ లీకేజీ ఘటన అనంతరం దానిపై దర్యాప్తు చేసేందుకు భారత ప్రభుత్వ అనుమతితో దక్షిణ కొరియా నుంచి వీరంతా ప్రత్యేక విమానంలో విశాఖకు వచ్చారు.

మరోవైపు విశాఖ ఎల్‌జీ పాలిమర్స్‌ ఘటనపై ఉన్నత స్థాయి కమిటీ విచారణ కొనసాగుతోంది. శనివారం నుంచి నిపుణులతో సంప్రదింపులు చేయనుంది.

ABOUT THE AUTHOR

...view details