విశాఖ జిల్లా అనకాపల్లిలో మూడేళ్ల బాలిక అపహరణపై పోలీసులు కేసు నమోదు చేశారు. మూడేళ్ల బాలిక లక్ష్మీభవానిని గుర్తుతెలియని వ్యక్తి ఎత్తుకెళ్లాడు. స్థానికంగా ఉండే సత్యనారాయణ థియేటర్ వద్ద బాలికను వ్యక్తి అపహరించాడు. బాలిక అదృశ్యంపై తల్లి తిరుపతమ్మ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజీ ఆధారంగా బాలికను ఓ వ్యక్తి తీసుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడు విజయవాడ నుంచి విశాఖ వస్తుండగా తిరుపతమ్మకు రైలులో పరిచయమయ్యాడు. ఉపాధి చూపిస్తానని బాలికతో పాటు తల్లిని కూడా అనకాపల్లి తీసుకెళ్లాడు.
అనకాపల్లిలో చిన్నారి అపహరణ.. సీసీ టీవీలో దృశ్యాలు - police
విశాఖ జిల్లా అనకాపల్లిలో మూడేళ్ల బాలిక అపహరణపై పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీ టీవి దృశ్యాలు పరిశీలించి.. ఓ వ్యక్తి తీసుకెళ్లినట్టు పోలీసులు గుర్తించారు.
కిడ్నాప్