వర్షాలకు దారులు కొట్టుకుపోయి రాకపోకలకు గిరిజనులు ఇబ్బందులు పడుతున్న వేళ...విశాఖ జిల్లా పాడేరు మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి స్వయంగా రంగంలోకి దిగారు. భారీ వర్షాలకు ఛిద్రమైన రాయగడ వంతెనకు తెదేపా శ్రేణులతో కలిసి శ్రమదానం ద్వారా రాళ్లతో మరమ్మతు చేశారు. తాను సైతం రాళ్లు మోసి తనవంతు సాయం చేశారు. గిరిజనుల కష్టాలు పట్టని రీతిలో ప్రభుత్వం ప్రదర్శిస్తున్న వ్యవహార శైలి సరికాదని తప్పుబట్టారు. ప్రస్తుత ఎమ్మెల్యే వరదలతో పాడైన వంతెనకు మరమ్మతులు చేయించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు.
వైకాపా పాలనలో అభివృద్ధి శూన్యం: గిడ్డి ఈశ్వరి - తెదేపా మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి
వైకాపా పాలనలో విశాఖ మన్యంలో అభివృద్ధి కుంటుపడిందని తెదేపా మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఆరోపించారు. భారీ వర్షాలు, వరదలతో రహదారులు పాడైపోయినా...నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు.
వైకాపా పాలనలో అభివృద్ధి శూన్యం