చిన్నప్పటినుంచి హైస్కూలు తరగతి దాకా ఆ స్నేహితులందరూ కలిసే చదువుకున్నారు. ఏమైందో ఏమో..ఆ గ్యాంగ్‌లోని ఓ స్నేహితుడు మరణించడంతో...మిగిలినవారూ కుటుంబానికి అండగా నిలిచారు. విశాఖ జిల్లా కె.కోటపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1994-95 సంవత్సరం పదోతరగతి విద్యార్థుల ఓ బృందం..అందరికి సహాయం చేస్తుండేది. ఆ గ్యాంగ్‌లోని ఓ స్నేహితుడు ఉబ్బనశెట్టి వెంకటరావు ఇటీవల మరణించాడు. మిగతా స్నేహితులందరూ కలిసి రూ.60 వేల రూపాయలను..మిత్రుని కుటుంబానికి అందజేశారు.
కోటపాడులో స్నేహితుడి కుటుంబానికి ఆర్థిక సాయం - కోటపాడు తాజా వార్తలు
వారంతా చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నారు. వారిలో ఒకరు చనిపోవడంతో మిగిలిన స్నేహితులు అందరూ కలిసి మిత్రుని కుటుంబానికి సహాయం చేశారు.. ఆ సొమ్మును విశాఖ జిల్లాలోని కోటంపాడులో ఉండే బాధిత కుటుంబానికి అందించి సేవాభావం చాటుకున్నారు.
స్నేహితుడి కుటుంబానికి ఆర్థిక సాయం