స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలని ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు తేదేపా శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. విశాఖ జిల్లా అనకాపల్లి నియోజకవర్గ తెదేపా విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని... ఓటమితో నిరాశ చెందకుండా స్థానికసంస్థల ఎన్నికల్లో తెదేపా సత్తా చాటాలన్నారు. దేశంలో ఏ ప్రభుత్వం ఆలోచించని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత చంద్రబాబుదని పేర్కొన్నారు. అయినా పరాజయం పొందడం నిరాశ కలిగించే అంశమని అన్నారు.
స్థానికసంస్థల ఎన్నికల్లో సత్తాచాటాలి - తేదేపా
వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించేలా పనిచేయాలని మాజీ మంత్రి తెదేపా నేత చింతకాయల అయన్నపాత్రుడు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. అనకాపల్లి నియోజకవర్గ తెదేపా విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు.
చింతకాయల అయ్యన్నపాత్రుడు