ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

1952లో దేశాన్ని విడిచారు....2019లో వచ్చారు! - విశాఖ మాచకుండ్ లో విదేశీ జంట వార్తలు

చిన్ననాటి తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకునేందుకు బీజీ జీవితాన్ని వదిలి ఓ విదేశీదంపతులు భారతదేశానికి వచ్చారు. బాల్యంలోని మధురానుభూతులను నెమరువేసుకునేందుకు ఆంధ్రాలో అడుగుపెట్టారు. ఎప్పుడో ఆరు దశాబ్దాల క్రితం తమ తల్లిదండ్రులతో మాచ్​ఖండ్ విద్యుత్ కేంద్ర నిర్మాణానికి వచ్చిన వారు... మళ్లీ అక్కడికే వచ్చి స్మృతులను గుర్తుచేసుకున్నారు.

దంపతులు

By

Published : Nov 18, 2019, 7:16 AM IST

అలనాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి..!

బాల్యం నాటి తీపి గుర్తులను వెతుకుతూ ఏకంగా దేశాలు దాటి వచ్చింది ఓ జంట. ఎప్పుడో ఆరు దశాబ్దాల క్రితం తమ తల్లిదండ్రులతో మాచ్​ఖండ్ విద్యుత్ కేంద్రం వద్ద గడిపిన వారు ... మళ్లీ ఇన్నాళ్లకు ఆ ప్రాంతానికి వచ్చారు. ఇంగ్లాండ్​కు చెందిన రిచార్డ్ గార్డ్, జెన్నిఫర్ గార్డ్​ దంపతులు విశాఖ జిల్లాలోని మాచ్​ఖండ్ జలవిద్యుత్ కేంద్రానికి ఆదివారం వచ్చారు. వీరివురి తల్లిదండ్రులు 1950 నుంచి 1952 వరకు విద్యుత్ కేంద్రం నిర్మాణ సమయంలో సొరంగాలలో పని చేశారు. వీరు బాల్యంలో రెండేళ్లు ఈ ప్రాంతంలోనే గడిపారు. అనంతరం దేశాన్ని వీడి ఇంగ్లాండ్​లో స్థిరపడ్డారు. ఒకప్పుడు స్నేహితులైన రిచార్డ్ గార్డ్, జెన్నిఫర్ గార్డ్​లు భార్యాభర్తలుగా మారారు.​ అప్పుడు వెళ్లిపోయిన వీరు మళ్లీ ఇన్నేళ్ల తరువాత మాచ్​ఖండ్​ ప్రాజెక్ట్ సందర్శించి వారి చిన్ననాటి మధుర స్మృతులను స్థానికులతో పంచుకున్నారు. కాసేపు ఆ ప్రాంతంలో ఆనందంగా గడిపారు.

ABOUT THE AUTHOR

...view details