ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తగ్గిన వర్షాలు.. ఆగని వరద ఉద్ధృతి - kalyanalova reservoir

విస్తారంగా కురిసిన వానలకు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వర్షాలు తగ్గినా విశాఖ జిల్లాలోని నర్సీపట్నం జలాశయాల్లో నీటి ఉద్ధృతి తగ్గటం లేదు. అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటూ నీటిని దిగువకు విడుదల చేస్తున్నామని అధికారులు పేర్కొన్నారు.

water released from reservoirs
జలాశయాల్లో నీరు దిగువకు విడుదల

By

Published : Oct 18, 2020, 4:15 PM IST

వర్షాలు తగ్గినా విశాఖ జిల్లాలోని నర్సీపట్నం డివిజన్ జలాశయాల్లో నీటి ఉద్ధృతి తగ్గటం లేదు. నాతవరం మండలం తాండవ జలాశయానికి సంబంధించి పూర్తిస్థాయి నీటిమట్టం 380 అడుగులు కాగా ప్రస్తుతం 378 .5 అడుగల వరకు నీరు చేరింది. అదనంగా చేరుతున్న నీటిని 2 గేట్లు ఎత్తి దిగువ ప్రాంతాలకు పంపిస్తున్నారు.

రావికమతం మండలం కళ్యాణలోవ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 460 అడుగులు కాగా , ప్రస్తుతం 458.5 అడుగుల దాకా నీరు చేరింది. ఈ జలాశయం పరివాహక ప్రాంతాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నందున కొండ గడ్డలు, వాగుల ద్వారా 330 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోందని జలవనరుల శాఖ అధికారులు పేర్కొన్నారు. నాలుగు గేట్లు ఎత్తి 320 క్యూసెక్కుల నీటిని వదులుతున్నట్లు తెలిపారు. అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటూ, దిగువ ప్రాంతాలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నామని అధికారులు చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details