జులై 28 నుంచి ఆగస్టు 3 వరకు మన్యంలో మావోయిస్టులు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలకు పిలుపునిచ్చారు. ఇలాంటి సమయంలో చింతపల్లిలో సెల్ టవర్ ఏర్పాటు చేసి.. పక్కనే ఫ్లెక్సీ పెట్టి.. మావోయిస్టులూ.. నన్ను పేల్చవద్దు.. కాల్చవద్దు అని రాసి పెట్టారు. మన్యంలో పలుచోట్ల గతంలో మావోయిస్టులు సెల్ టవర్ పేల్చివేసిన ఘటనలు ఉన్నాయి. ఈ క్రమంలో సెల్ టవర్ని కాపాడుకోవడం కోసం ఫ్లెక్సీపై అలా రాసి ఉండడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఓ సెల్ టవర్.. దాని మనోగతాన్ని తెలుపుతూ ఆసక్తిగా కనిపిస్తుంది.
'మావోయిస్టులూ నన్ను పేల్చొద్దు.. కాల్చొద్దు' - మావోయిస్టుల అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు న్యూస్
విశాఖ మన్యం చింతపల్లిలో ఓ ఫ్లెక్సీ అందర్నీ ఆకర్షిస్తోంది... ఓ నమూనా సెల్ టవర్ ఏర్పాటు చేసి పక్కన ఫ్లెక్సీలో 'మావోయిస్టులూ నన్ను పేల్చొద్దు... కాల్చవద్దు... నేను గిరిజనులకు మేలు చేసే టవర్ ని' అని రాసి ఉంది.
మావోయిస్టులూ నన్ను పేల్చొద్దు.. కాల్చొద్దు