ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కుమార్తెను హత్య చేసి సామాజిక మాధ్యమాల్లో సెల్ఫీ వీడియో పోస్టు - killed his daughter a selfie video on social media

Father killed daughter in Visakha: విశాఖ రెల్లి వీధిలో దారుణం జరిగింది. కూతుర్ని తానే చంపిన తండ్రి ఆ తర్వాత సెల్ఫీ వీడియోను పోస్టు చేయడం కలకలం రేపింది. ఆ సెల్ఫీ వీడియోను తండ్రి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశాడు. కూతురిని చంపిన తర్వాత తండ్రి ప్రసాద్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు.

Etv Bharat
Etv Bharat

By

Published : Nov 4, 2022, 10:28 PM IST

Updated : Nov 5, 2022, 12:14 PM IST

Father killed daughter in Visakhapatnam: విశాఖలో కన్నతండ్రే కూతురిని హతమార్చిన ఘటన చోటుచేసుకుంది. హత్య చేసిన అనంతరం సెల్ఫీ వీడియో తీసుకుని తన కూతురిని తానే చంపేశానని చెబుతూ సామాజిక మధ్యమాలలో పోస్టు చేశా తండ్రి వడ్డాది ప్రసాద్. విశాఖ రెల్లివిధిలో నివాసం ఉంటున్న వడ్డాది ప్రసాద్ (42)ని భార్య హేమలత 13 సంవత్సరాల క్రితం వదిలేసి వేరుగా ఉంటోంది. 13 సంవత్సరాల నుంచి ఇద్దరు ఆడపిల్లల్ని ప్రసాద్ పెంచాడు.

పెద్ద కూతురు ప్రేమ పెళ్లి చేసుకొని వేరే వ్యక్తితో వెళ్లిపోగా.. రెండు రోజులు క్రితం చిన్న కూతురు కూడా స్థానికంగా ఉండే ఓ యువకుడితో వెళ్లిపోయినట్లు సమాచారం. నిన్న వన్ టౌన్ స్టేషన్లో ఇరువురిని పిలిచి కౌన్సెలింగ్ చేసినప్పటికీ తన కూతురు మనసు మారలేదని.. కూతురు ప్రేమించిన వ్యక్తిపై కేసులు కూడా ఉన్నాయని తండ్రి నచ్చజెప్పినప్పటికి వినలేదని తెలిసింది. ఇవాళ ప్రసాద్ తల్లి చనిపోయిన రోజు కావడంతో కూతుర్ని ఇంటికి పిలిచి హత్య చేసినట్లు ప్రసాద్ సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు. అనంతరం వన్ టౌన్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ప్రసాద్​ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ మార్చురీకి తరలించారు.

కూతుర్ని చంపి సెల్ఫీ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసిన తండ్రి.

ఇవీ చదవండి:

Last Updated : Nov 5, 2022, 12:14 PM IST

ABOUT THE AUTHOR

...view details