నర్సులు, కేర్ గివర్స్ దినోత్సవం సందర్భంగా విశాఖలో ఏర్పాటు చేసిన ఫ్యాషన్ షో ఆకట్టుకుంది. నగర్ లయన్స్ క్లబ్లో గ్లోబల్ ఎయిడ్, హ్యుమన్ కేర్స్ సంస్థల ఆధ్వర్యంలో షో నిర్వహించారు. కార్యక్రమంలో దివ్యాంగులు, వారి తల్లిదండ్రులు, ప్రత్యేక అవసరాలు కలిగిన వారికి సేవలు చేసే నర్సులు పాల్గొన్నారు. దివ్యాంగుల కోసం వివిధ మార్గాల్లో సేవలందిస్తున్న వారికి ప్రత్యేకంగా సన్మానించారు.
విశాఖలో ఆకట్టుకున్న 'ప్రత్యేక' ఫ్యాషన్ షో
విశాఖలో ఏర్పాటు చేసిన వినూత్న ఫ్యాషన్ షో అందర్నీ ఆకట్టుకుంది. దివ్యాంగులు, వారి తల్లిదండ్రులు, నర్సులు చేసిన ర్యాంపు వాక్ అలరించింది.
విశాఖలో ఆకట్టుకున్న 'ప్రత్యేక' ఫ్యాషన్ షో