విశాఖ జిల్లాలో తలపెట్టిన 6,116 ఎకరాల భూసమీకరణకు రైతుల నుంచి పలుచోట్ల అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఆనందపురం మండలం గిడిజాల పంచాయతీలో రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఎన్నో ఏళ్లుగా భూములను సాగుచేసుకుంటూ జీవిస్తున్నామని సమీకరణ పేరిట తమ భూములు తీసుకుంటే పరిస్థితి ఏంటని అధికారులను రైతులు నిలదీశారు. భూసమీకరణకు తాము వ్యతిరేకమని స్పష్టం చేశారు. రైతుల ఆందోళన మధ్య గ్రామసభను అర్ధాంతరంగా నిలిపేసిన అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాగా మామిడిపాలెంలో భూసమీకరణకు వ్యతిరేకంగా రైతులు ఆర్డీవో ఎదుట నిరసన వ్యక్తం చేశారు.
'ఏళ్లుగా భూమినే నమ్ముకున్నాం.. మీరు తీసుకుంటే మా పరిస్థితేంటి..?' - భూసమీకరణను వ్యతిరేకిస్తున్న రైతులు
విశాఖ జిల్లాలో ప్రభుత్వ భూ సమీకరణకు రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. భూ సమీకరణకు తాము వ్యతిరేకమని రైతులు స్పష్టం చేశారు. ఏళ్లుగా తమ భూమినే నమ్ముకుంటూ బతుకుతున్నామని సమీకరణ పేరిట తీసుకుంటే తమ పరిస్థితేంటని అన్నదాతలు వాపోయారు.
భూసమీకరణను వ్యతిరేకిస్తున్న రైతులు