రెండు కుటుంబాల మధ్య ప్రజలు నలిగిపోతున్నారని... వారు స్వేచ్ఛగా మాట్లాడలేకపోతున్నారని భాజపా ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ ఆరోపించారు. డాక్టర్.సుధాకర్ వ్యవహారంలో ప్రభుత్వం అందించిన నివేదికలో నిజాలు చెప్పలేదని పేర్కొన్నారు. డాక్టర్ కేసును హైకోర్టు సీబీఐకి అప్పగించడం ఆనందించాల్సిన విషయమని పేర్కొన్నారు.
'రెండు కుటుంబాల మధ్య ప్రజలు నలిగిపోతున్నారు'
రాష్ట్ర ప్రభుత్వం డా.సుధాకర్‌పై అమానుషంగా వ్యవహరించిందని భాజపా ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ అన్నారు. డాక్టర్ కేసును హైకోర్టు సీబీఐకి అప్పగించడం ఆనందించాల్సిన విషయమని పేర్కొన్నారు. నలభై ఏళ్ల నుంచి వివిధ రంగాల్లో విధులు నిర్వర్తించే ఉద్యోగులు... ప్రభుత్వాల ఒత్తిళ్లకు బలవుతున్నారని మండిపడ్డారు. డాక్టర్. సుధాకర్ వ్యవహారంలో ప్రభుత్వ నివేదికకు, న్యాయ అధికారుల నివేదిక వ్యత్యాసం వచ్చిందని తెలిపారు. ప్రభుత్వ పనులు ప్రజలను ఇబ్బందులు పెడుతున్నాయంటున్న ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్‌తో ఈటీవీ భారత్ ప్రతినిధి ఆదిత్య పవన్ ముఖాముఖి.
భాజాపా ఎమ్మెల్సీ పీవీఎన్. మాధవ్