విశాఖ జిల్లా అనంతగిరి మండలం రొంపల్లి పంచాయతీలోని మారుమూల గ్రామమైన కరకవలసలో పలువురు గిరిజనులను వింత వ్యాధి భయాందోళనకు గురి చేస్తోంది. కొంతమందికి కాలు పొంగులు, కడుపు నొప్పి, కల్లు ఎర్రబడటం వంటి లక్షణాలుతో బాధపడుతున్నారు. దీని బారినపడి నెల రోజులలోపే నలుగురు మృతి చెందారు. వారి బాధపై 'ఈటీవీ భారత్' కథనం వెలువరించగా... అధికారులు అప్రమత్తమయ్యారు. కరకవలసలో వైద్య పరీక్షలు నిర్వహించారు.
20 మందికి ఆ వింత వ్యాధి లక్షణాలు ఉండటంతో అధికారులు... వారిని రెండు 108 అంబులెన్సుల్లో గజపతినగరం కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు గురువారం పంపించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు.