ప్రతిభ కనబర్చిన జర్నలిస్టుల పిల్లలకు ప్రోత్సాహం - encouragement
విద్యలో ఉత్తమ ప్రతిభ చూపిన జర్నలిస్ట్ పిల్లలకు వైవీఎస్ మూర్తి ఆడిటోరియంలో ఆర్థిక ప్రోత్సాహకం అందించారు.
జర్నలిస్టుల పిల్లలకు ప్రోత్సాహం
వైజాగ్ జర్నలిస్ట్స్ ఫోరం ఆధ్వర్యంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన జర్నలిస్టుల పిల్లలకు ఆర్థిక ప్రోత్సాహకాన్ని అందించారు. ఏటా స్కాలర్ షిప్ లు అందించడం ద్వారా పాత్రికేయ వృత్తిలో ఉండే వారి పిల్లలను ప్రోత్సహించడానికి అవకాశం దక్కుతోందని వీజేఎఫ్ ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ఏయూ వీసీ ఆచార్య నాగేశ్వరరావు, సెంచూరియన్ విశ్వవిద్యాలయం వీసీ జీఎస్ఎన్ రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి.