ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎలమంచిలి నియోజకవర్గంలో పోలింగ్​కు ఏర్పాట్లు పూర్తి

ఏప్రిల్ 11న ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. నియోజకవర్గాల్లో పోలింగ్ ఏర్పాట్లకు అధికారులు సన్నాహకాలు చేస్తున్నారు. ఎలమంచిలి నియోజకవర్గంలో ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. పోలింగ్ సామగ్రిని విశాఖకు తరలించి అక్కడినుంచి సంబంధిత పోలింగ్ కేంద్రాలకు పంపించనున్నారు.

ఎలమంచిలి నియోజకవర్గంలో పోలింగ్​కు ఏర్పాట్లు పూర్తి

By

Published : Apr 9, 2019, 7:39 PM IST

ఎలమంచిలి నియోజకవర్గంలో పోలింగ్​కు ఏర్పాట్లు పూర్తి

విశాఖ జిల్లా ఎలమంచిలి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల పోలింగ్​కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 260 పోలింగ్ బూత్​లకు సంబంధిచిన సామగ్రిని సిద్ధం చేశారు. నమూనా బ్యాలెట్​లను... అభ్యర్థులకు సంబంధించిన గుర్తులు, పేర్లతో ఉన్న పోస్టర్లను రెడీగా ఉంచారు. ఎలమంచిలి నుంచి ఈ పోలింగ్ సామగ్రిని ప్రత్యేక వాహనాల్లో విశాఖపట్నం తరలిస్తున్నారు. అక్కడి నుంచి ఆర్టీసీ బస్సుల్లో ఆయా పోలింగ్ కేంద్రాలకు వీటిని పంపిస్తామని ఎన్నికల అధికారులు చెబుతున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details