విశాఖ జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలోని పెద్ద బొడ్డేపల్లి గ్రామ మరిడిమాంబ ఆలయ నిర్మాణానికి పలువురు దాతలు విరాళాలు అందజేస్తున్నారు. వైకాపా నేత గుడివాడ లక్ష్మీరామ్ తన సహాయం కింద రూ.1,00,116 విరాళంగా ఇచ్చారు. ఈ మొత్తం ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ చేతుల మీదుగా ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు.
మరిడిమాంబ ఆలయ నిర్మాణానికి విరాళాలు - నర్సీపట్నంలో ఆలయ నిర్మాణం
విశాఖ జిల్లా పెద్ద బొడ్డేపల్లి గ్రామ మరిడిమాంబ ఆలయ నిర్మాణానికి వైకాపా నేత గుడివాడ లక్ష్మీరామ్ లక్షా నూట పదహారు రూపాయలను విరాళంగా ఇచ్చారు. ఈ మొత్తాన్ని నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ చేతుల మీదుగా ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు.
ఆలయ నిర్మాణానికి విరాళం అందజేత
మరిడిమాంబ ఆలయ నిర్మాణానికి అన్ని రకాలుగా సహాయం అందిస్తామని ఎమ్మెల్యే గణేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకుడు విజయ్ కుమార్, దేవాలయ కమిటీ సభ్యులు ఈశ్వరరావు, రమణ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: పెద్దేరు, కోనాం జలాశయాల నుంచి నీరు విడుదల