పేద ముస్లింలకు రంజాన్ తోఫా - ramjan gift for muslims distribution at visakha
విశాఖలో పేద ముస్లింలు రంజాన్ పండగను సంతృప్తిగా నిర్వహించుకోవాలనే ఉద్దేశంతో రంజాన్ బహుమతిగా నిత్యావసరాలను అందిస్తున్నామని...మా ప్రేమ స్వచ్ఛంద సంస్థ నిర్వహకుడు తోట ముకుంద్ అన్నారు.
పేద ముస్లింలు రంజాన్ పండగను సంతృప్తిగా నిర్వహించుకోవాలని రంజాన్ బహుమతిగా మా ప్రేమ స్వచ్ఛంద సంస్థ నిర్వహకుడు తోట ముకుంద్ అన్నారు. విశాఖలో మూడు వందల మంది పేద ముస్లింలకు రంజాన్ బహుమతి అందించారు. తాను చదువుకున్న రోజుల నుంచి ముస్లిం కుటుంబాలతో సత్సంబంధాలు కలిగి ఉండటం వల్లనే వారి పండగలో భాగస్వామిని అవుతున్నాని ముకుంద్ అన్నారు. రంజాన్ బహుమతిగా నిత్యావసరాలను అందిస్తున్నామన్నారు. లాక్ డౌన్ సందర్భంగా ఇప్పటివరకు 6వేల మందికి నిత్యావసరాలు అందజేసినట్టు ముకుంద వివరించారు.