విశాఖలో సీఆర్‌జెడ్ నిబంధనలను ఉల్లంఘించి నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేయాలని డిమాండ్ చేస్తూ ఉత్తరాంధ్ర రాజకీయ ఐక్యవేదిక విశాఖలో ఆందోళన చేపట్టింది. సీఎం జగన్ రాష్ట్రవ్యాప్తంగా అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్న నేపథ్యంలో విశాఖ సాగరతీరంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన నోవాటెల్ హోటల్‌ను కూల్చివేయాలని నాయకులు నిరసన చేపట్టారు. జిల్లావ్యాప్తంగా అనేక అక్రమ కట్టడాలు ఉన్నప్పటికీ జీవీఎంసీ అధికారులు వాటిని కూల్చడంలో తాత్సారం చేస్తున్నారని ఆరోపించారు. సీఆర్‌జెడ్ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన కట్టడాలన్నింటినీ కూల్చివేయాలని.. లేనిపక్షంలో రేపు నోవాటెల్ ఎదుట ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.
'విశాఖలో అక్రమ కట్టడాలను కూల్చివేయాలి'
నిబంధనలకు విరుద్ధంగా విశాఖలో నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేయాలని డిమాండ్ చేస్తూ ఉత్తరాంధ్ర రాజకీయ ఐక్యవేదిక నాయకులు ఆందోళన చేపట్టారు. లేనిపక్షంలో రేపు ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఉత్తరాంధ్ర రాజకీయ ఐక్యవేదిక నాయకులు ఆందోళన