ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

డీసీసీబీ నర్సీపట్నం బ్రాంచ్​ మేనేజర్​, ఫీల్డ్ ఆఫీసర్​ సస్పెన్షన్​

నిబంధనలు అతిక్రమించి రుణాలు మంజూరు చేసినందుకుగానూ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు నర్సీపట్నం బ్రాంచ్​ మేనేజర్​, ఫీల్డ్ ఆఫీసర్లు సస్పెండ్​కు గురయ్యారు. ఈ మేరకు డీసీసీబీ సీఈవో డీవీఎస్ వర్మ ఆదేశాలు జారీ చేశారు.

dccb manager suspended due to granting loans contrary to regulations
నర్సీపట్నం డీసీసీబీ మెనేజర్ సస్పెండ్

By

Published : Mar 28, 2021, 8:52 PM IST

జిల్లా కేంద్ర సహకార బ్యాంకు నర్సీపట్నం బ్రాంచ్​ మేనేజర్​పై సస్పెన్షన్ వేటు పడింది. నిబంధనలకు విరుద్ధంగా రుణాలు మంజూరు చేసినందుకుగానూ బ్రాంచ్ మేనేజర్, ఫీల్డ్ ఆఫీసర్లను సస్పెండ్ చేస్తూ.. జిల్లా అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

'విశాఖ జిల్లా నర్సీపట్నం బ్రాంచ్ మేనేజర్​ ఎస్​విఎస్ భరణి కుమార్, ఫీల్డ్ ఆఫీసర్ కె.నాగేశ్వరరావు.. రుణాల మంజూరు అక్రమాలకు పాల్పడారు. ఒకే కుటుంబానికి చెందిన ఎక్కువ మందికి రుణాలు మంజూరు చేసినట్లు వార్షిక ఆడిట్​లో తేలింది. అంతేకాక ఒకే వ్యక్తికి 5 సార్లు రుణాలు మంజూరు చేయడం, అదే కుటుంబంలో పలువురు పేర్ల మీద రుణాలు మంజూరు చేశారు. దీంతో రుణాల మంజూరులో అవకతవకలకు పాల్పడినట్లు జిల్లా అధికారులు గుర్తించారు. దీంతో సంబంధిత అధికారులపై చర్యలు తీసుకున్నాం' అని డీసీసీబీ సీఈవో వర్మ వివరించారు.

సమగ్ర విచారణ

ఈ అంశంపై సమగ్ర విచారణకు ఒక ప్రత్యేక అధికారిని నియమిస్తామని.. పూర్తిస్థాయి నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు సీఈవో పేర్కొన్నారు. అధికారుల సస్పెండ్ అంశం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. దీంతో మిగతా బ్యాంకు ఉద్యోగుల గుండెల్లో గుబులు రేపింది.

ABOUT THE AUTHOR

...view details