Damaged Roads in Anakapalli District: అనకాపల్లి - అల్లూరి జిల్లాలను అనుసంధానం చేసే రహదారుల పరిస్థితి అధ్వానంగా తయారైంది. అనకాపల్లి జిల్లాలోని చోడవరం మార్గంలో రోడ్లు వర్షం పడినప్పుడు చెరువులను తలపిస్తున్నాయి. అనకాపల్లి నుంచి మామిడిపాలెం, వెంకన్నపాలెం వరకు ప్రయాణించాలంటే.. గంటన్నర పైగా పడుతోందని అటుగా వెళ్లే ప్రయాణికులు అంటున్నారు. ఆంధ్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలను కలుపుతున్న ఈ రహదారిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి.
డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు, రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్నాథ్, ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ నియోజవర్గాల్లోని రోడ్ల పరిస్థితి మరి దారుణంగా తయారైందని స్థానిక ప్రజలు వాపోతున్నారు. పాలకులు ధ్వంసమైన రోడ్లను పట్టించుకోవడం లేదని విమర్శిస్తున్నారు. రోడ్లు పూర్తిగా మరమ్మతులు చేయకపోయినా పర్వాలేదు కానీ.. కనీసం గుంతలైనా పూడ్చాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
ఆంధ్రా రోడ్ల గురించి కేసీఆర్ వ్యాఖ్యలపై వైసీపీ మంత్రుల మౌనం ఎందుకు - గాదె వెంకటేశ్వరరావు
అనకాపల్లి జిల్లా కేంద్రాన్ని అనుసంధానం చేసే.. గ్రామీణ ప్రాంతాల రోడ్లు అధ్వానంగా ఉన్నాయని ప్రజలు వాపోతున్నారు. అధికారంలోకి వచ్చి నాలుగున్నర సంవత్సరాలు అవుతున్నా.. పాలకులు కనీసం ఒక్కరోజు కూడా ఈ రోడ్లను పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంలోని ముఖ్యనేతలు ప్రతినిథ్యం వహిస్తున్న ప్రాంతాల్లోని రోడ్లే ఇలా ఉండటంపై విమర్శలు వస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోని రోడ్లపై ప్రయాణించాలంటే నరకంగా ఉందని ప్రయాణికులు అంటున్నారు.
చోడవరం - మాడుగులను అనుసంధానం చేసే రహదారి దారుణంగా తయారైందని అక్కడి గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం 2కిమీ దూరానికే గంటన్నర సమయం పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా చోడవరం వెళ్లే రహదారిలో.. మామిడిపాలెం, వెంకన్నపాలెం సమీపంలో తరచూ రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. జిల్లా కేంద్రానికి ఈ రహదారి గుండా వెళ్లాలంటే ప్రయాణికులు నరకాన్ని అనుభవిస్తున్నామని అంటున్నారు.
YSRCP Flag in Road Pothole: 'ఇదీ మా ఘనతే..!' రోడ్డుపై ప్రమాదకరంగా గుంత.. పార్టీ జెండాతో వాహనదారులకు హెచ్చరిక
ప్రయాణంలో ఇబ్బందుల మాట దేవుడేరుగు.. ఆ రోడ్ల గుండా వెళ్తే ఆరోగ్య సమస్యలు తలెత్తున్నాయని ప్రయాణికులు అంటున్నారు. దుమ్ము, దూళి వల్ల .. వాహనాల కుదుపుల వల్ల ఆరోగ్య సమస్యలని అంటున్నారు. ఈ మార్గాల్లో ప్రయాణం వల్ల వాహనాల టైర్లు పాడైపోతున్నాయని.. యాజమానులు ఆందోళన చెందుతున్నారు. రవాణా రంగం మీద ఆధారపడి జీవిస్తున్న వారికి కిడ్నీ సంబంధిత సమస్యలు తలెత్తున్నాయని వాపోతున్నారు.
ఈ రోడ్లు 125 పైగా గ్రామాలను అనుసంధానం చేస్తున్నాయి. ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాలకు వెళ్లే ఈ మార్గాన్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. విశాఖ - అనకాపల్లి - అల్లూరి జిల్లాలను అనుసంధానం చేస్తున్న ఈ రోడ్లపై ఏర్పడిన గుంతల్లో కనీసం తట్టేడు మట్టి కూడా వేయలేదు. కొన్ని సందర్భాల్లో సమీప గ్రామస్తులే గుంతలను పూడ్చుకున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ రోడ్లను బాగు చేయాలని ప్రయాణికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
Andhra Pradesh Roads in Worst Condition: అడుగుకో గుంత.. ప్రజలకు నరకం.. పట్టించుకోని అమాత్యులు