లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని విశాఖ జిల్లా అనకాపల్లి పట్టణ సీఐ భాస్కర్ హెచ్చరించారు. నిబంధనలు పాటించనందుకు పట్టణంలో నేటి వరకు 460 మందిపై క్రిమినల్ కేసులు పెట్టినట్లు ఆయన వెల్లడించారు. వీరితో పాటు నిబంధనలు అతిక్రమించిన 2,519 మంది వాహనదారులపై కేసులు నమోదు చేశామని వివరించారు. పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేసే దాతలు గుంపులుగా వెళ్లొద్దని ఆయన సూచించారు. స్వచ్ఛంద సేవకులు, దాతలు ముందుగా పోలీసులకు సమాచారం ఇచ్చి ఒకరు లేదా ఇద్దరు డోర్ డెలివరీ చేయవచ్చని ఆయన చెప్పారు.
'లాక్డౌన్: ఉల్లం'ఘనుల'పై క్రిమినల్ కేసులు'
రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లాక్డౌన్ను మరింత పటిష్టంగా అమలు చేస్తున్నారు అధికారులు. నిబంధనల ఉల్లంఘనలపై భారీగా కేసులు నమోదు చేస్తున్నారు. అనకాపల్లి పట్టణంలోనే నేటి వరకు 460 మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు.
lock down