విశాఖ జిల్లా అనకాపల్లిలో మరో 47 మందికి కరోనా సోకింది. కరోనా నిర్ధారించిన వారిలో గవరపాలెం, గాంధీనగరం, వేల్పులవీధి, దుర్గా లాడ్జి వీధి, నర్సింగ రావు పేట వాసులు ఉన్నారు. కరోనా బాధితులు పెరుగుతున్న నేపథ్యంలోప్రజలు అప్రమత్తంగా ఉండాలని అనవసరంగా ఎవరు బయటకు రావద్దని అనకాపల్లి పట్టణ సీఐ భాస్కరరావు ప్రజలకు సూచించారు.
అనకాపల్లిలో మరో 47 మందికి కరోనా.. - covid cases in vishaka anakapalli
అనకాపల్లిలో కరోనా విజృంభిస్తోంది. మరో 47 మంది వైరస్ బారిన పడ్డారు. గవరపాలెం, గాంధీనగరం, వేల్పుల వీధి, దుర్గా లాడ్జి వీధిలో ఈ కేసులు నమోదయ్యాయి. అధికారులు ఆయా ప్రాంతాల్లో శానిటైజ్ చేశారు. ప్రజలెవ్వరు అనవసరంగా బయటికి రాకూడదని హెచ్చరించారు.
అనకాపల్లిలో మరో 4 7 మందికి కరోనా
ఇవీ చదవండి