విశాఖ జిల్లా కేథరిన్ విద్యాసంస్థల చైర్మన్ ఆలీవర్ రాయ్.. తగరపువలస జాతీయ రహదారి వద్ద వలస కూలీలకు నిరంతరాయంగా అన్నదానం చేస్తున్నారు. సుమారు 25 రోజులుగా ఉదయం 11 గంటల నుంచి రాత్రి వరకు వందలాది మంది అన్నార్తుల ఆకలి తీరుస్తున్నారు. మంచినీరు, మజ్జిగ, శీతల పానీయాలు అందజేస్తున్నారు.
తాళ్లవలస, సంగివలస, తగరపువలస, మహారాజుపేట, రాజాపులోవ కేంద్రాలుగా... జాతీయ రహదారిపై ఈ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. లారీలు, బస్సులు, కాలినడకన వెళ్తున్న వలసకూలీలు ఆకలి తీరుస్తున్నారు.