ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కోళ్ల వ్యర్థాలలో కలుషితమవుతున్న చెరువులు..

విశాఖ జిల్లా మాడుగుల నియోజకవర్గంలో పలు మండల్లాల్లోని సాగునీటి చెరువుల్లో చేపల పెంపకందారులు కోళ్ల వ్యర్థాలను కలుపుతున్నారు. అధికారులు స్పందించి దీనిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

By

Published : Dec 22, 2020, 3:36 PM IST

Contaminating ponds
కోళ్ల వ్యర్థాలలో కలుషితమవుతున్న చెరువులు

జిల్లాలోని మాడుగుల, చీడికాడ, దేవరాపల్లి, కె.కోటపాడు మండలాల్లోని సాగునీటి చెరువుల్లో విచ్చలవిడిగా కోళ్ల వ్యర్థాలు కలుపుతున్నారు. దీంతో నీరు విషతుల్యం అవుతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఆందోళనలు చేపట్టారు. అయినా అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

పరిస్థితి ఇలాగే కొనసాగితే మూగజీవాలు మృత్యువాత పడతాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. చేపల పెంపకం దారులు చెరువుల్లో కోళ్ల వ్యర్థాలు వేయకుండా నిలువరించాలని అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ సమస్యపై చర్యలు తీసుకుంటామని చీడికాడ ఈవోపీఆర్డీ చెప్పారు.

ఇదీ చదవండి:ప్రభుత్వ భూమిలోని అక్రమ నిర్మాణాల తొలగింపు

ABOUT THE AUTHOR

...view details