ఉక్కు కార్మిక సంఘాల మధ్య చిచ్చుపెట్టేందుకు భాజపా రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నర్సింహరావు చేస్తున్న యత్నాలను తిప్పికొడతామని కార్మికవర్గం స్పష్టం చేసింది. ఉక్కు జోలికొస్తే సహించబోమని హెచ్చరించింది. ఒకటి, రెండు కార్మిక సంఘాలు తప్ప మిగతావన్నీ ప్రైవేటీకరణకు మద్దతిస్తున్నాయన్న జీవీఎల్ వ్యాఖ్యలను ఖండిస్తూ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ రాస్తారోకోకు పిలుపునిచ్చింది. శనివారం సాయంత్రం కూర్మన్నపాలెం కూడలిలో ఉక్కు కార్మికులు రాస్తారోకో చేపట్టారు. అరగంట పాటు నాలుగువైపులా వాహనాలు నిలిచిపోయాయి. జాతీయ రహదారిపై వడ్లపూడి పైవంతెన, అగనంపూడి టోల్ గేటు వరకు ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
vishaka steel workers: 'విశాఖ ఉక్కు జోలికొస్తే సహించం'
ఉక్కు కార్మిక సంఘాల మధ్య చిచ్చుపెట్టేందుకు భాజపా రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నర్సింహరావు చేస్తున్న యత్నాలను తిప్పికొడతామని కార్మికవర్గం స్పష్టం చేసింది. ఉక్కు జోలికొస్తే సహించబోమని హెచ్చరించింది.
కార్మికులు ర్యాలి నిర్వహిస్తున్న దృశ్యం
ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ సమన్వయకర్త జె.అయోధ్యరామ్ మాట్లాడుతూ ఉక్కు కార్మిక సంఘాల ఐక్యతను దెబ్బతీసేలా మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కమిటీ నాయకులు గంధం వెంకటరావు మాట్లాడుతూ భాజపా ఎన్ని కుతంత్రాలు పన్నినా కార్మిక సంఘాలు కలిసికట్టుగా పోరాటం చేసి ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకుంటాయన్నారు. అనంతరం జీవీఎల్ వ్యాఖ్యలపై దువ్వాడ సీఐకి పోరాట కమిటీ నాయకులు ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో కమిటీ నాయకులు పలువురు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: