భూమి సరిహద్దు విషయమై జరిగిన వివాదం గురించి ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళితే... ఎ.కోడూరు ఎస్సై సతీష్ తనపై అకారణంగా దాడి చేశారంటూ ఉపాధి హామీ వీఆర్పీ పాటూరి సింహాచలం చోడవరం సీఐకి సోమవారం రాత్రి ఫిర్యాదు చేశారు. ఎస్సైకి ఫిర్యాదు చేస్తుండగా ఆయన తీవ్ర పదజాలంతో దూషిస్తూ... చొక్కా పట్టుకుని లాక్కుంటూ వెళ్లి దాడికి పాల్పడ్డాడని వీఆర్పీ ఆరోపించారు. అడ్డుకోబోయిన తన భార్యన నెట్టేశాడని చెప్పారు. భార్యాభర్తలిద్దరూ సీఐ ఈశ్వరరావుకు ఫిర్యాదు చేశారు.
అకారణంగా కొట్టారంటూ ఎస్సైపై ఫిర్యాదు..!
భూమి సరిహద్దు విషయమై ఫిర్యాదు చేయటానికి వెళితే... ఎస్సై తనను కొట్టాడని ఓ వ్యక్తి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఘటన విశాఖ జిల్లా కోడూరులో జరిగింది.
కొట్టారంటూ ఎస్సై పై ఫిర్యాదు