ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖ ఘటన: బాధితులకు పరిహారం అందజేత - గ్యాస్ లీక్ బాధితులకు చెక్కులు అందించిన మంత్రులు

ఎల్జీ పాలిమర్స్ ఘటనలో మృతుల కుటుంబసభ్యులు, క్షతగాత్రులకు ప్రభుత్వం ప్రకటించిన పరిహారం అందింది. ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రులు కురసాల కన్నబాబు, అవంతి శ్రీనివాసరావు బాధితులకు చెక్కులు అందజేశారు.

compensation cheques to vizag lg gas leak incident victims
విశాఖ ఘటన: బాధితులకు పరిహారం అందజేత

By

Published : May 13, 2020, 8:38 PM IST

విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనలో క్షతగాత్రులకు ప్రభుత్వం పరిహారం అందజేసింది. రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి, మంత్రులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, కురసాల కన్నబాబు కేజీహెచ్​లో చికిత్స పొందుతున్న బాధితులకు చెక్కులను అందజేశారు.

మృతుల కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి కోటి రూపాయలు చొప్పున నలుగురికి అందజేశారు. 3 రోజుల క్రితం 8 మంది మృతుల కుటుంబ సభ్యులకు పరిహారం ఇవ్వగా.. నేడు మిగిలిన నలుగురికి ఇచ్చారు. కొంతమంది క్షతగాత్రులకు పాతికవేల రూపాయన చొప్పున పరిహారం చెల్లించారు.

ఇవీ చదవండి... 'వారిని తీసుకొచ్చేందుకు విమానాలు ఏర్పాటు చేయండి'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details