విశాఖ జిల్లాలో ఇళ్ల స్థలాల లేఅవుట్‌ల వ్యవహారం ఇంకా రాజుకుంటూనే ఉంది. చోడవరంలో పంప్ హౌస్ స్థలం పట్టాలుగా ఇవ్వడాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ఈ మేరకు తహసీల్దారుకు వినతిపత్రం అందజేశారు. పట్టణ ప్రజలకు తాగునీరు అందించేందుకు 8 ఎకరాల్లో పంప్‌హౌస్ నిర్మించగా.... ఈ స్థలంలోని ఆరు ఎకరాలను పేదలకు ఇళ్లపట్టాలు పంపిణీ చేసేందుకు సిద్ధం చేస్తున్నారు. దీన్ని వ్యతిరేకిస్తూ మాజీ ఎమ్మెల్యే రాజు ఆధ్వర్యంలో ప్రజలు తహసీల్దార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.
విశాఖలో ఇళ్ళస్థలాల వ్యవహారంపై రాజుకుంటున్న రచ్చ - విశాఖలో ఇళ్లస్థలాల పంపుణీ వార్తలు
పంప్‌హౌస్ స్థలాన్ని అధికారులు పేదల ఇళ్లపట్టాలకు ఇచ్చే యత్నం చేస్తున్నారు. దీన్ని చోడవరం ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వారు ర్యాలీగా తరలివెళ్లి తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.
chodavaram land issue in vishaka