విశాఖ మన్యం చింతపల్లి మండలం కుడుముసారి గ్రామ పంచాయతీలోని చింతలపాడు గ్రామానికి రహదారి సదుపాయం లేకపోవటంతో...గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రహదారి సదుపాయం లేకపోవడంతో... రోగులను తప్పనిసరి అనుకుంటే డోలీ మోతలతో ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది.
ఇటీవల కాలంలో అయిదుగురు గర్బిణీలను సకాలంలో ఆసుపత్రికి తీసుకెళ్లలేకపోవడంతో మృత్యవాత పడ్డారని స్థానికులు వాపోయారు. అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని.... ప్రతీ ఏటా కనీసం కాలిబాటయినా ఉంచాలనే ఉద్దేశ్యంతో శ్రమదానంతో రహదారిని నిర్మిస్తున్నామని, గట్టిగా వర్షాలు పడితే ఆ రహదారి మూసుకుపోతుందని గిరిజనులు వాపోయారు. ఇందులో బాగంగా ఇటీవల కాలంలో మూసుకుపోయిన రోడ్డును శ్రమదానంతో ఒక రూపుకు తీసుకువచ్చే పనిలో ఉన్నామని, అధికారులు స్పందించి చింతలపాడు గ్రామానికి పక్కా రహదారి సదుపాయం కల్పించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.